తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమల : తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంత‌రం చక్రస్నానం నిర్వహించారు.

శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    వినాయక నిమజ్జనం కోసం హైడ్రా విశిష్ట‌ సేవలు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న యాత్ర కొన‌సాగుతోంది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నగరవాసులు వినాయక నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొన్ని విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయినప్పటికీ ప్రధాన నిమజ్జన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. భక్తుల…

    శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ

    తిరుప‌తి : తిరుప‌తి లోని ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *