అశ్లీల‌త‌, విద్వేషం డీఎంకే నైజం : సీఎం

చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను ఏకి పారేశారు సీఎం విజయ్. డీఎంకేను “ప్రజాస్వామ్య వ్యతిరేక” పార్టీగా అభివర్ణించారు. దాని సిద్ధాంతంలో అశ్లీలత, విద్వేషం పాతుకు పోయాయని విజయ్ ఆరోపించారు. పార్టీలో విషపూరిత రాజకీయ సంస్కృతిని స్టాలిన్ గర్వంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన నిందించారు. ధారపురం అసెంబ్లీ ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి శనివారం ఖండించారు. ఆయన ఆమె శరీరాన్ని కించపరుస్తూ, ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని విజయ్ ఆరోపించారు. ధారపురంలో మాజీ ముఖ్యమంత్రి ప్రచారం “అపవాదులు, స్త్రీ ద్వేషం, వ్యక్తిగత దూషణలతో” నిండి ఉందని విజ‌య్ మండిప‌డ్డారు.

తమిళ మహిళల కొడుకుగా, సోదరుడిగా, తమ్ముడిగా తాను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు సీఎం. అక్టోబర్ 6న జరిగే ఓటింగ్‌లో ధారపురం ఓటర్లు తగిన సమాధానం ఇస్తారని ఆయన అన్నారు. డీఎంకే ప్రచార సభలో గతంలో ఏఐఏడీఎంకేలో ఉండి, తమిళగ వెట్రి కజగం అభ్యర్థిగా ఉన్న సత్యభామ అధికార పార్టీకి విధేయత మార్చుకున్నారని స్టాలిన్ విమర్శించారు. ఆమె డబ్బు కోసం శిబిరం మార్చిందని సూచిస్తూ, ఆయన “పెట్టి” (సూట్‌కేస్), “బల్టీ” (గాలిలో పల్టీ) వంటి మారుపేర్లను ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. స్టాలిన్ కు ప్ర‌జ‌ల‌న్నా, ప్రత్యేకించి మహిళ‌లంటే గౌర‌వం లేద‌న్నారు. ప్ర‌జ‌లు షాక్ ఇచ్చినా ఇంకా ఓట‌మి పాఠాలు నేర్చు కోవ‌డం లేద‌న్నారు విజ‌య్.

  • Related Posts

    బ్లాక్ మ‌నీని వైట్ గా మార్చుకుంటున్న రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత మ‌న్నె క్రిశాంక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఆయ‌న కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అడ్డ‌గోలు వ్య‌వ‌హారాల గురించి ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు. శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్ లో…

    |22-ఎ సమస్యల పరిష్కారానికి కీల‌క నిర్ణ‌యం

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురు చెప్పారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *