హైదరాబాద్ : యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చారిత్రాత్మకమైన రణబాలి మూవీలో కలిసి నటిస్తున్నారు. గతంలో పరుశురామ్ దర్శకత్వంలో ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం లో నటించారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధం తర్వాత కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ రణబాలి కావడం తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించారు.
రణబాలి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ తో తన అనుభవాలను పంచుకున్నాడు నటుడు విజయ్ దేవరకొండ. తనతో పోటీ పడగలిగే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని అన్నాడు. రష్మిక మందన్నా తన జీవిత భాగస్వామి కావడంపై తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలో విజయవంతమైన “ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్” చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు విజయ్ దేవరకొండ. మొత్తంగా తనకు రష్మిక మందన్నా సతీమణి కావడం దేవుడు ఇచ్చిన వరం అని పేర్కొన్నాడు.







