దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్

ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే కాదు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు. త‌ను 19 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు క్రికెట్ లోకి అడుగు పెట్టాన‌ని చెప్పాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన సియ‌ట్ టి20 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. సియ‌ట్ టి20 బ్యాట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డుకు ఎంపిక‌య్య‌డు ఈ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌న కెరీర్ ప‌రంగా ఎత్తు ప‌ళ్లాలు ఉన్నాయి. ఓపెన‌ర్ గా ప్ర‌మోట్ చేశాక 12 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో మూడు సెంచ‌రీలు ఉన్నాయి. ఇక 37.90 స‌గ‌టుతో 183.70 స్ట్రైక్ రేట్ తో మొత్తం 417 ప‌రుగులు చేశాడు. అంద‌రి క్రికెట‌ర్ ల కంటే ముందంజ‌లో ఉన్నాడు.

ఈ సంద‌ర్బంగా ఓపెన‌ర్లుగా అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ లు ఇప్పుడు భార‌త టి20 ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్నారు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. అవార్డు తీసుకున్న అనంత‌రం సంజూ శాంస‌న్ ప్ర‌సంగించాడు. ఈ అవార్డును త‌న భార్య చారుకి అంకితం చేస్తున్నాన‌ని తెలిపాడు. త‌ను కూడా నాతో పాటే ప్ర‌యాణం చేస్తోంద‌న్నాడు. 10 ఏళ్ల‌వుతోంది నేను క్రికెట్ ఆట‌లోకి వ‌చ్చింది. 5 టి20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ ల వ్య‌వ‌ధిలో మూడు మ్యాచ్ విన్నింగ్ సెంచ‌రీలు సాధించ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. భార‌త దేశం త‌ర‌పున ఆడ‌డం, జెర్సీ ధ‌రించ‌డం కంటే గొప్ప విష‌యం ఏం ఉంటుంద‌ని ప్ర‌శ్నించాడు శాంస‌న్.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *