కీలక ప్రకటన చేసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్
బీహార్ : తక్కువ వయసులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి ఊహించని రీతిలో ఛాన్స్ దక్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. కోచ్ ద్రవిడ్ తనను ఏరికోరి తీసుకున్నాడు. తన అంచనాలు తప్పు కాలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. ఇక అక్టోబర్ 15 నుండి మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరిగే ప్లేట్ లీగ్ సీజన్-ఓపెనర్‌లో బీహార్ అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది .
తాజాగా చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఇండియా U-19 , ఆస్ట్రేలియా U-19 మధ్య జరిగిన మొదటి అనధికారిక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మొదటి రోజు భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇక బుధవారం నుండి ప్రారంభమయ్యే రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు బీహార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని వైస్-కెప్టెన్‌గా నియమించింది, సకిబుల్ గని కెప్టెన్‌గా ఉన్నారు. జట్టును బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. సూర్యవంశీ 2023-24 సీజన్‌లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. తరువాత అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్‌ను పొందిన అతి పిన్న వయస్కుడిగా (13) నిలిచాడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో భారత అండర్-19 పర్యటనలలో కూడా పాల్గొన్నాడు.








