ఫిట్ నెస్ తో ఉన్నా ఎంపిక చేయలేదు
కోల్ కతా : భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలే భారత జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ లు అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఇద్దరు వచ్చాక ఎంపికలో వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా జట్టు ఎంపిక చేసే సమయంలో ఆయా ఆటగాళ్లకు సంబంధించి ప్రతిభను పరిగణలోకి తీసుకుంటారని అన్నాడు. అయితే తాను ఎందులోనూ తక్కువ కాదన్నాడు. తన పనితీరు సూపర్ గా ఉందని, కానీ ఫిట్ నెస్ విషయం గురించి తనకు తెలియదని మీడియాకు అజిత్ అగార్కర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ ఇద్దరి నిర్వాకం కారణంగానే తాను జట్టులోకి రాలేక పోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు స్టార్ పేసర్ . తాజాగా షమీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే అప్ డేట్ కావాలంటే మీరు అడగాలే తప్పా తాము ఎలా ఇస్తామంటూ ప్రశ్నించాడు .
తను ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తమ రౌండ్ 1 మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో తలపడనుంది. తను ఇక్కడికి చేరుకున్నాడు. ప్రాక్టీస్ ప్రారంభించాడు. గాయం గురించిన అప్ డేట్స్ అందించడం తన పని కాదన్నారు. విచిత్రం ఏమిటంటే ఆకాష్ దీప్ , షమీ పశ్చిమ బెంగాల్ జట్టు తరపున జతకట్టారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు ఆడలేదు. ఆకాష్ దీప్ మంచి బౌలర్ అని, తన అనుభవం జట్టుకు మరింతగా ఉపయోగ పడుతుందన్నారు. ఫిట్ గా ఉన్నందుకే ఇక్కడ ఆడుతున్నానని చెప్పారు.








