స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సచివాలయంలో విద్యా రంగంపై సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఏరియాలో ఉన్న పాఠశాలల పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. స్థల సమస్య ఉంటే పక్కనే ఉన్న పాఠశాలలకు తరలించాలని ఆదేశించారు సీఎం.
సౌకర్యాల లేమి ఉన్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడకు తరలిస్తే ఇబ్బందులు అంటూ ఉండవన్నారు రేవంత్ రెడ్డి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ నూతన పాఠశాలలు ప్రారంభం 2026 అకడమిక్ సంవత్సరం నుంచి అమలు జరిగేలా కార్యచరణ రూపొందించాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.






