ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌దు

స్ప‌ష్టం చేసిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి

తిరుప‌తి జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తిరుప‌తి జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆక‌స్మిక త‌నిఖీల‌తో హొరెత్తించారు. శ‌నివారం జిల్లాలోని మంగ‌ళంలోని అట‌వీ శాఖ‌కు చెందిన ఎర్ర చంద‌నం గో డౌన్ల‌ను ప‌రిశీలించారు. మొత్తం ఎనిమిది గో డౌన్ల‌ను క‌లియ తిరిగారు. ఆయా గో డౌన్ల‌లో ఎప్ప‌టి నుంచి ఎర్ర చంద‌నం దుంగ‌లు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. అంతే కాకుండా గ‌త కొన్నేళ్లుగా ఎన్నెన్ని ఇక్క‌డ భ‌ద్ర ప‌రిచార‌ని ఆరా తీశారు. అంత‌కు ముందు గో డౌన్ల‌లో దుంగ‌ల‌కు సంబంధించిన రికార్డుల‌ను , ఫైళ్ల‌ను త‌నిఖీ చేశారు. మొత్తం దుంగ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన రిపోర్టుల‌ను త‌న‌కు పంపించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మ‌యంలో ఏ ఒక్క‌రూ విధుల ప‌ట్ల అల‌సత్వం ప్ర‌ద‌ర్శించ వ‌ద్ద‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌ద‌ని, అలా జ‌రిగితే కఠిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర స‌ర్కార్ పూర్తిగా నిఘా ఉంచింద‌ని, అత్యంత విలువైన ఎర్ర చంద‌నం దుంగ‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సంబంధిత అట‌వీశాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *