పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌విత ముచ్చ‌ట

క‌నీస సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ఆరా

వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌నం బాట‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా రైతులు, మహిళ‌లు, క‌ళాకారులు, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ వ‌స్తున్నారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ ను నిల‌దీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో పండించిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న చెందారు. వారికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేదంటూ వాపోయారు. ధాన్యం త‌డిసినా స‌రే ఎఫ్ సీ ఐ కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇదే క్ర‌మంలో మంగ‌ళ‌వారం జాగృతి జనంబాటలో భాగంగా దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సందర్భంగా విద్యార్థులతో తరగతి గదిలో కూర్చుని ముచ్చటించారు. పాఠశాలలో పరిస్థితులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క‌నీస వ‌సతి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం ప‌ట్టించు కోక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు క‌విత‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *