చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

Spread the love

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్

చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఊహించ‌ని రీతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ ధ‌ర‌కు త‌న‌ను తీసుకుంది. శాంస‌న్ ను తీసుకునేందుకు కీల‌క‌మైన ఆట‌గాళ్లు ర‌వీంద్ర జ‌డేజా, శామ్ క‌ర‌న్ ల‌ను వ‌దులుకుంది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. అయితే శాంస‌న్ అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు ఐపీఎల్ లో . రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును ఏక‌తాటిపై న‌డిపించాడు. ఆ జ‌ట్టును ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకు వ‌చ్చాడు. ఇందులో త‌న పాత్ర ఉంది. ఇది కాద‌న‌లేని స‌త్యం. ఇదే స‌మ‌యంలో ఈసారి జ‌రిగిన ఐపీఎల్ లో త‌నకు తెలియ‌కుండానే మేనేజ్మ‌మెంట్ యుజేంద్ర చాహ‌ల్ తో పాటు జాస్ బ‌ట్ల‌ర్ ను జ‌ట్టు నుంచి రిలీజ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

ప్ర‌స్తుతం ఐపీఎల్ వేలం పాట‌లో సంజూ శాంస‌న్ వాల్యూ ధ‌ర రూ. 18 కోట్లుగా ఉంది. త‌న‌ను తీసుకునేందుకు గాను రూ. 14 కోట్లు విలువ చేసే ర‌వీంద్ర జ‌డేజాతో పాటు రూ. 2.4 కోట్లు విలువ చేసే శామ్ క‌ర‌న్ ను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇదిలా ఉండ‌గా సంజూ శాంస‌న్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున 11 సార్లు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వ‌హించాడు . 2013లో చేరిన అతను త్వరగా కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2014 సీజన్‌కు ముందు కేవలం 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. అతను 2018లో తిరిగి వచ్చి 2021లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. జట్టు డైరెక్టర్ కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో 2022లో రాజ‌స్థాన్ జ‌ట్టును ఫైన‌ల్ దాకా తీసుకు వెళ్ల‌డంలో ముఖ్య భూమిక పోషించాడు.

  • Related Posts

    బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు

    Spread the love

    Spread the loveసీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర…

    శాంస‌న్ ను కోల్పోవ‌డం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు న‌ష్టం

    Spread the love

    Spread the loveప్ర‌ముఖ క్రికెట‌ర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్ ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో , కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఫాఫ్ డుప్లెసిస్ .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *