అమ‌రావ‌తి రైతులు అధైర్య ప‌డ‌వ‌ద్దు

Spread the love

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

అమ‌రావ‌తి : సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. శ‌నివారం స‌చివాల‌యంలో రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై ఏర్పాటైన క‌మిటీ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, సీఆర్డీఏ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెల‌ల కాలంలోనే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. మ‌రోసారి భూములు కోల్పోయిన వారికి సంబంధించి ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా వాటిని ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిబ్రవరి లో కేసు విచారణ జ‌రుగుతుంద‌న్నారు. అయితే అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌యారిటీ

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి హైద‌రాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు చోటు…

    సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏపీ ప్ర‌భుత్వం కృషి

    Spread the love

    Spread the loveకేంద్రానికి నిధులు ఇవ్వాల‌ని కోరిన మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ : ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప‌ర్యాట‌క , సాంస్కృతిక రంగాల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక ప‌రంగా మ‌రింత తోడ్పాటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *