ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?

పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళ‌న‌లు

పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మ‌రోసారి అంత‌ర్యుద్దం మొద‌ల‌య్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్ర‌ధాన‌మంత్రి, ఒక‌ప్ప‌టి క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారా. అవున‌నే అంటున్నారు ఆయ‌న‌కు చెందిన కుటుంబ స‌భ్యులు. త‌న సోద‌రీమ‌ణులు జైలు బ‌య‌ట ఆందోళ‌న‌కు దిగారు. వారిపై పోలీసులు విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడికి పాల్ప‌డిన‌ట్లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వివిధ కేసుల‌కు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ గ‌త 2023వ సంవ‌త్స‌రం నుంచి జైలులోనే ఉన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను చంపేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఇమ్రాన్ ఖాన్.

త‌న‌కు ఏమైనా జ‌రిగితే త‌న‌దే బాధ్య‌త అని ప్ర‌క‌టించాడు. దీంతో పాకిస్తాన్ కు మ‌ద్ద‌తుదారుగా ఉన్న అరబ్ దేశాధినేత‌లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఇమ్రాన్ ఖాన్ ను భౌతికంగా ఉండేలా చూడాల‌ని కూడా సూచించిన‌ట్లు స‌మాచారం. కానీ ఐఎస్ఐ ఆధ్వ‌ర్యంలో ఇమ్రాన్ ఖాన్ ను జైలు లోపటే చంపేసిన‌ట్లు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు పీటీఐ పార్టీ బాధ్యులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా
పాకిస్తాన్ మాజీ ప్రధాని 22 రోజులుగా ఒంటరిగా ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గత మూడు వారాల్లో కుటుంబ సభ్యులతో సమావేశం జరగలేదని అందుకే త‌మ‌కు అనుమానం ఉంద‌ని , ఖాన్ ను జైలులోనే లేపేసి ఉంటార‌ని అంటూ వాపోయారు మ‌ద్ద‌తుదారులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *