డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Spread the love

జనవరి 2 నుండి 8వ తేది వ‌ర‌కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది.

రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాత‌లు వారి కుటుంబ స‌భ్యుల‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు రోజుకు 125 మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. రూ.ల‌క్ష నుండి రూ.99 ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళం ఇచ్చిన దాత‌ల‌కు డిసెంబ‌ర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జ‌న‌వ‌రి 1వ తేది నుండి 8వ తేది వ‌ర‌కు రోజుకు 2 వేల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. వీరు కూడా ఆన్ లైన్‌ అప్లికేష‌న్ లో డిసెంబ‌ర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్ల‌ను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌మ‌నించి స‌హ‌క‌రించాల్సిందిగా భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

  • Related Posts

    స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ చెంత‌న సీఎం రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveత‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజు అన్న అనుముల‌ ములుగు జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద మేడారం జాత‌ర‌కు జ‌నం పోటెత్తారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిలిచారు. మేడారం…

    వ‌న‌ దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

    Spread the love

    Spread the loveమొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వ‌రంగ‌ల్ జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాత‌ర మేడారం జ‌న‌సంద్రంగా మారింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *