శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

ద‌ర్శించుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

త‌మిళ‌నాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమ‌వ‌వారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క డండ‌లి ( టిటిడి) తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్ , ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.

పట్టు వస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు . ఇదిలా ఉండ‌గా 2006 నుంచి ప్రాచీన శ్రీ వైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ టిటిడి తరఫున శ్రీరంగానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంద‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయ‌యుడు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్ , అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *