సీఎం కోడ్ ఉల్లంఘ‌న‌పై ఈసీకి ఫిర్యాదు

Spread the love

క‌మిష‌న‌ర్ ను క‌లిసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నిక‌ల కోడ్ ను విధించింద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, స‌భలు నిర్వ‌హించ కూడ‌ద‌ని ఆ విష‌యం తెలిసినా ప‌ట్టించు కోవ‌డం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడ‌మే కాకుండా ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను క‌లిశారు క‌విత‌. ఈ సంద‌ర్భంగా విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరార‌ని చెప్పారు. ఎన్నికల కోడ్ ను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారంటూ ఆరోపించారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. నవంబర్ 30వ తేదీన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింద‌ని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి ప్రచారాన్ని నిలుపుదల చేయించాల‌ని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఈసీని కోరారు.

  • Related Posts

    స‌త్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌త్త్వా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ…

    కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ

    Spread the love

    Spread the loveమాట నిల‌బెట్టుకున్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఆయ‌న ఇటీవ‌లే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సంద‌ర్శించారు. మత్స్య‌కారుల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇప్పిస్తాన‌ని చెప్పారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *