యుద్దానికి సిద్దం మాదే విజయం
ప్రకటించిన వైఎస్ జగన్ రెడ్డి
భీమిలి – ఎన్నికల్లో యుద్దానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎవరినైనా ఢీకొనే సత్తా తమకు ఉందన్నారు. శనివారం ఎన్నికల ప్రచారానికి భీమిలి వేదికగా శ్రీకారం చుట్టారు. గతంలో హామీలు ఇచ్చి, అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది కాదా అని ప్రశ్నించారు. తాము పైరవీలు,కాకా పట్టడాలు చేయడం లేదన్నారు. తమ పార్టీ ప్రజలను నమ్ముకుందన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క ఏపీలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు జగన్ రెడ్డి.
గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారంటూ ఆరోపించారు. తాము ఇచ్చిన వాటిని 99 శాతం అమలు చేశానని అన్నారు. ప్రతిపక్షాలు పన్నే పద్మ వ్యూహంలో చిక్కుకు పోయేందుకు తాను ఆనాటి అభిమన్యుడిని కానని స్పష్టం చేశారు సీఎం.
ఇక్కడ ఉన్నది యుద్దానికి సిద్దమైన అర్జునుడని పేర్కొన్నారు. తనకు కృష్ణుడు లాంటి ప్రజలు అండగా ఉన్నారని తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. మరోసారి సత్తా చాటుతామని , అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. 56 నెలల పాలనలో గడప వద్దకే సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు.