బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ
కోల్ కతా : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టి20, వన్డే, టెస్టు ఫార్మాట్ లకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా సరి పోతాడని అన్నారు. తను తాజాగా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే క్రికెట్ రంగంలో ప్రతి క్రికెటర్ కు మంచిగా ఆడాలని ఉంటుందన్నాడు. కానీ ఒక్కోసారి ఫామ్ కారణంగా ఆశించిన మేర ఆడలేక పోవచ్చని అన్నాడు. అంత మాత్రాన క్రికెటర్లను తక్కువగా అంచనా వేయలేమన్నాడు. అనుకోకుండా ఆడలేక పోయిన ఆటగాళ్లు రికార్డులు సృష్టించారని , ఎలా ఆడుతున్నారనేది ముఖ్యమన్నారు.
తాను ఈడెన్ గార్డెన్స్ లో కూర్చున్నప్పుడు ఒకరు వచ్చి శుభ్ మన్ గిల్ టి20 కెప్టెన్ గా ఉండాలని మీరు అనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఒక్కటే..తను ఈ ఫార్మాట్ కు కెప్టెన్ గా ఉండాలని, అంతే కాదు అన్ని ఫార్మాట్ లకు సరిగ్గా సరి పోతాడని స్పష్టం చేశాడు. తాను చెప్పిన ట్లుగానే గిల్ అద్బుతంగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చారు. ఇంగ్లండ్ లో జరిగిన సీరీస్ లో గిల్ నాయకత్వంలో టీమిండియా సూపర్ షో చేసిందన్నాడు. అంతే కాదు తన పర్ ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉందన్నాడు .







