తెలంగాణ సమ్మిట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9వ తేదీలలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ -2025 కు రావాలంటూ తనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారని చెప్పారు. ప్రత్యేకంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఇన్విటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే ప్రతిష్టాత్మకమైన ఈ సమ్మిట్ కు హాజరు కావాలా లేదా అని ఇంకా తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పరకామణి కేసుపై విచారణకు ఆదేశించామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇదే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. లేడీ డాన్లు పెరిగి పోయారన్నారు. వారి తోకలు కట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు లేకుండా చర్యలు తీసుకుంటామని, అందరినీ ఏరి పారేస్తామన్నారు సీఎం.






