ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి గొట్టిపాటి

గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపునకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స‌మ‌ర్త‌వంత‌మైన‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తణుకు రోడ్డు రన్ 10K, 5K, 3K’ కార్యక్రమంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైజాగ్‌లో ఐదు లక్షల మందితో నిర్వహించిన యోగా మహోత్సవం ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన గిన్నిస్ రికార్డు రాష్ట్ర ఆరోగ్య సంకల్పానికి నిదర్శనం అని అన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రతి కుటుంబం, గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని శారీరక దృఢత్వం కోసం కేటాయించాలని కోరారు .

  • Related Posts

    అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

    Spread the love

    Spread the loveసంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం…

    దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకోం ఎదుర్కొంటాం

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ శ్రేణుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లుగా బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున రెండో విడ‌త జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దీంతో త‌ట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు దాడుల‌కు దిగ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *