కీలక వ్యాఖ్యలు చేసిన హర్షా బోగ్లే
హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనతో పాటు మరో దిగ్గజ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సైతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ను ఏకి పారేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరైనా ప్రతిభను ఆధారంగా ఎంపిక చేస్తారని, మరి ప్రాబబుల్స్ లో ఎంపిక చేసిన కోచ్ ఉన్నట్టుండి ఫైనల్ టీమిండియా జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టి20 ఫార్మాట్ లో అద్బుతమైన ట్రాక్ రికార్డ్ సంజూ శాంసన్ కు ఉందన్నారు హర్ష బోగ్లే. భారత క్రికెట్ జట్టులో సంజు సామ్సన్ అస్థిర అవకాశాలపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ను “చాలా త్వరగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశార.
క్రిక్‌బజ్ లైవ్‌లో మాట్లాడుతూ భోగ్లే భారతదేశం సెలక్షన్ మ్యూజికల్ చైర్‌లకు సామ్సన్ బాధితుడని వాదించారు, అక్కడ అతని అపారమైన ప్రతిభ , సామర్థ్యం ఉన్న ఆటగాడికి అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడటానికి, ప్రదర్శన ఇవ్వడానికి అవసరమైన నిరంతర ఆటలను అందించ లేక పోవడం బాధాకరమన్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు హర్షా భోగ్లే. కావాలని బ్యాటింగ్ ఆర్డర్ ను కూడా మార్చడాన్ని తప్పు పట్టారు. రాబోయే రోజుల్లో జట్టు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.








