NEWSTELANGANA

బీఆర్ఎస్ కు షాక్ జెడ్పీటీసీలు జంప్

Share it with your family & friends

రోజు రోజుకు బీట‌లు వారుతున్న పార్టీ

క‌రీంన‌గ‌ర్ జిల్లా – బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ త‌గిలింది. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. త‌మ‌కు గులాబీ పార్టీ వ‌ద్దంటూ ప్ర‌క‌టించారు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు.

ముస్తాబాద్ మండ‌లంలో మూకుమ్మ‌డిగా రాజీనాల ప‌ర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ వ‌ల్ల తాము అవ‌మానాలు ఎదుర్కొన్నామ‌ని, త‌మ‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని వాపోయారు. ఈ సంద‌ర్బంగా తాము పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

జెడ్పీటీసీ న‌ర‌స‌య్య‌తో పాటు 8 మంది స‌ర్పంచ్ లు, 60 మంది వార్డు స‌భ్యులు, మాజీ స‌ర్పంచ్ లు, ఎంపీటీసులు, మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్, మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తామంతా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు భారీ ఎత్తున రాజీనామాలు రాబోతున్న‌ట్లు స‌మాచారం.