ఎవరి ప్రయోజనాల కోసం కాపాడుతున్నారని ఫైర్
చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తను ఆదివారం స్పందించాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుభ్ మన్ గిల్ ను ఏకి పారేశాడు. అంతే కాదు కోచ్ పని చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. తన ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశాడు. విచిత్రం ఏమిటంటే ఎవరి మెప్పు పొందేందుకు, ఎవరి ఒత్తిళ్ల కోసం మీ ఇద్దరూ శుబ్ మన్ గిల్ ను ఆడిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక రకంగా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగాడు.
ఓ వైపు అవకాశాల కోసం పెద్ద ఎత్తున కష్ట పడుతున్న ప్లేయర్లను పక్కన పెట్టడం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యాడు. దేశివాళి పోటీలలో ఆడుతూ సత్తా చాటిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఎందుకు ఎంపిక చేయడం లేదని మండిపడ్డాడు. ఒకే ఒక్క మ్యాచ్ లో రాణించక పోతే తీసేస్తారా మరి గిల్ వరుసగా వైఫల్యం చెందినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నాడు. సంజు సామ్సన్‌ను ఒకే టేక్‌లో బాగా నటించాల్సిన నాటక కళాకారుడిలా చూస్తున్నారని , కానీ గిల్‌ను మాత్రం ‘నువ్వు బాగా చేసే వరకు మేము చిత్రీకరణ కొనసాగిస్తాం’ అని చెప్పి ఒక సినిమా స్టార్‌లా చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సదగోపన్ రమేష్.







