ప్రశంసలు కురిపించిన షేన్ బాండ్
హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్ షేన్ బాండ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ , సీఎస్కే జట్టు సభ్యుడు సంజూ శాంసన్ గురించి స్పందించాడు. తను అద్భుతమైన ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సోమవారం షేన్ బాండ్ స్పందించాడు. భిన్నమైన షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి అని పేర్కొన్నాడు. కళ్లు చెదిరేలా సిక్స్ లు కొట్టడంలోనూ, అలవోకగా ఫోర్లు సాధించడంలో టాప్ లో ఉంటాడని అన్నాడు. తన లాంటి ఆటగాడితో కలిసి మైదానంలో ఆడాలని ఎవరికైనా ఉంటుందని తెలిపాడు షేన్ బాండ్.
సంజు శాంసన్ తో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందని స్పష్టం చేశాడు. అతను చాలా సరదా మనిషి, మంచి హాస్య చతురత ఉందన్నాడు, ఐపీఎల్ , ఇతర ఫార్మాట్ ల సందర్బంగా ఆడే సమయంలో మేమిద్దరం చాలా కనెక్ట్ అయ్యామని చెప్పాడు షేన్ బాండ్. అయితే అతన్ని పసుపు రంగు జెర్సీలో చూడటం వింతగా అనిపిస్తుందని అన్నాడు. కానీ ఆ చిలిపి నవ్వును నేను ఖచ్చితంగా చూస్తానని అనుకుంటున్నానని తెలిపాడు షేన్ బాండ్. వాస్తవానికి, అతను మా జట్టుపై పరుగులు చేయకూడదని మీరు కోరుకుంటారు, కానీ అదే సమయంలో, మీరు ఒకరితో సమయం గడిపినప్పుడు, మీరు వారిపై అభిమానం పెంచుకుంటారని అన్నాడు. తను మరిన్ని పరుగులు చేయాలని కోరాడు.








