ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో సెల్ఫీ వైరల్
ముంబై : వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కోల్ కతాకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రాహుల్ గాంధీలతో కలిశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా అభివాదం చేశారు. సీఎం టీంతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. ఇదే మైదానం వేదికగా కీలక , ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మెస్సీ. తాను ఎన్నో ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా తిరిగానని, కానీ హైదరాబాద్ లో లభించినంత ప్రేమ, ఆప్యాయత తాను ఎక్కడా చూడలేదన్నారు. హైదరాబాద్ ను తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నాడు మెస్సీ.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్బంగా మెస్సీ ని ఘనంగా సన్మానించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆయనతో పాటు నటులు అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ను కూడా సన్మానించడం వివాదానికి దారి తీసేలా చేసింది. ఇదే సమయంలో తను సీఎం భార్యనన్న అహకారంతో అమృత ఫడ్నవీస్ ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మెస్సీ వద్దకు వెళ్లింది. చూయింగ్ గమ్ నములుతూ ఫోటో తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఎంత సీఎం భార్య అయితే మాత్రం ఇలాగేనా వ్యవహరించేది అంటూ నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు.








