పోలీసుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నిరంత‌రం లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న పోలీసుల‌కు తీపిక‌బురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సోమ‌వారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో జరిగిన వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పౌరసేవలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ శాఖకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కోసం కృషి చేయాలని సూచించారు.

గ‌త ప్ర‌భుత్వం పోలీసుల బాగోగులు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. కానీ ఎప్పుడైతే కూట‌మి స‌ర్కార్ రాష్ట్రంలో కొలువు తీరిందో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా పోయాయ‌ని చెప్పారు. పోలీసుల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు స‌ర్కార్ పూర్తిగా దృష్టి సారించింద‌ని అన్నారు. ఎలాంటి వేధింపులు లేకుండా స్నేహ పూర్వ‌క‌మైన వాతావార‌ణంలో విధులు నిర్వ‌హించేలా చేశామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

  • Related Posts

    ప్రోటోకాల్ వివాదం చంద్ర‌బాబు ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveమాజీ ఎమ్మెల్యే వ‌ర్మ తీరుపై సీఎం సీరియ‌స్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో కూట‌మి నేత‌ల మ‌ధ్య ప్రోటోకాల్, ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేత‌లు స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డ‌క్క‌డా వివాదాలు చోటు చేసుకుంటూనే…

    ఆర్టీసీ కార్మికుల‌కు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్

    Spread the love

    Spread the loveస‌మ్మె విర‌మించ‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు హైద‌రాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల స‌మ్మె నేప‌థ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స‌మ్మె చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. ఇలాగే స‌మ్మెను కొన‌సాగిస్తే స‌మ్మెలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *