తమిళ నాట బీజేపీకి క్రేజ్
స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ – భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి (ఎన్డీయే)కి తిరిగి మూడోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని జోష్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు పీకే.
ఇదిలా ఉండగా ప్రముఖ ఛానల్ లో చిట్ చాట్ సందర్బంగా ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి భారీగా మద్దతు పెరిగిందన్నారు. ఇది ఒకింత ఆశ్చర్య పోయే అంశమన్నారు. ఇదే సమయంలో అయోధ్య లోని రామ మందిరం పునః ప్రారంభం సందర్భంగా పర్యటించిన మోదీకి ఊహించని రీతిలో ఆదరణ లభించిందన్నారు.
కాగా ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ ఎన్ .రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ చీఫ్ అన్నామలై అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని హెచ్చరించారు. ఏ ఒక్క తమిళ పత్రిక, ఛానల్ అతడికి సపోర్ట్ చేయొద్దని కోరారు.