వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని స్పస్టం చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సిఆర్ఓ, పీఏసీ 1 , 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 , 2, ఏటీసీ, ఎంబీసీ-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల , వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా 20వ తేది ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు , స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నట్లు వెల్లడించింది.







