సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ : ష‌ర్మిలా రెడ్డి

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న బేకార్

విజ‌య‌వాడ : ఏం సాధించారని సూప‌ర్ సిక్స్ సూప‌ర్ స‌క్సెస్ అంటూ స‌భ నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. బుధ‌వారం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అని నిల‌దీశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉంటే ఒక్కరికైనా 3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి.

ముందు మీరు ప్ర‌క‌టించిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రానా ఉద్యోగాలు ఇచ్చినట్లా అని ఫైర్ అయ్యారు. ఒక్కరికి భృతి ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం రాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు ఆర్థిక సహాయం అనేది సూపర్ సిక్స్ హామీ అన్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే లేద‌న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో ఒక్క మహిళకైనా 15 వందలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదేనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ? అన్నదాత సుఖీభవ కింద సొంతగా 20 వేలు ఇస్తామని మాట మార్చారని ఆరోపించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *