ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

Spread the love

సిఫార‌సుల‌కు నో ఛాన్స్ భ‌క్తుల‌కే ప్ర‌యారిటీ

తిరుమ‌ల : శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల‌లో ఇవాళ మ‌రోసారి ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధ‌వారం మ‌రోసారి ఆయ‌న కొలువు తీరారు. టీటీడీ ఎక్స్ అఫిసియో మెంబ‌ర్ గా కూడా ప్ర‌మాణం చేశారు. అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల్ కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీకి ఈవోగా ప‌ని చేస్తూ బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మంతో పాటు ఆల‌య ప్ర‌ధాన పూజారులు, అర్చ‌కులు . అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇది స్వామి త‌న‌కు ఇచ్చిన గొప్ప అవ‌కాశం అన్నారు. మ‌రోసారి తాను వ‌స్తాన‌ని అనుకోలేద‌న్నారు. కానీ ఆ దేవ దేవుడు త‌న‌ను క‌రుణించాడ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన ఈవో చాలా సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చార‌ని అన్నారు. సాంకేతికత‌ను ఉప‌యోగించుకునేలా చేస్తామ‌న్నారు. ఇదే క్ర‌మంలో భ‌క్తుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది తలెత్త‌కుండా త‌న వంతుగా ప‌ని చేస్తాన‌ని, ఎలాంటి పైర‌వీల‌కు , సిఫార‌సుల‌కు తావంటూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో.

  • Related Posts

    ప్ర‌ధాని మొహ‌ర్రం పండుగ శుభాకాంక్ష‌లు

    Spread the love

    Spread the loveఇమామ్ హుస్సేన్ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం మొహ‌ర్రం పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం సందర్భంగా…

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం

    Spread the love

    Spread the loveభ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కృషి తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తారు. ఆయ‌న‌ను సేవిస్తారు. జీవితంలో ఒక్క‌సారైనా స్వామిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *