ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టోకెన్లు

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. జ‌న‌వ‌రి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ విధానంలో శ్రీ‌వాణి టోకెన్లు జారీ చేయ‌న్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు ఆన్ లైన్ లో టోకెన్లు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు ఈవో. టోకెన్లు పొందిన భ‌క్తులు సాయంత్రం 4 గంట‌ల‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.
దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా నెల రోజుల పాటు చేస్తామ‌న్నారు. అయితే రేణిగుంట ఎయిర్ పోర్టులో య‌ధావిధిగా శ్రీ‌వాణి టోకెన్లు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

అయితే శ్రీ‌వాణి టోకెన్ల‌కు సంబంధించి ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు ఈవో. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి చేశామ‌న్నారు. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గి పోతుందన్నారు. అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందన్నారు.

తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంద‌ని, ఇందులో ఎలాంటి మార్పు చేయ‌లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచు కోవాల‌ని కోరారు ఈవో.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు)…

    సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

    Spread the love

    Spread the loveనారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్ తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *