‘ఎక్స్ ‘లోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చిన కావ్య పాప‌

Spread the love

సోష‌ల్ మీడియాలో ఎస్ఆర్ హెచ్ ఓన‌ర్ వైర‌ల్

చెన్నై : త‌మిళ‌నాడుకు చెందిన కావ్య మార‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమెకు ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేదు. త‌ను కోట్లాది రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వార‌సురాలు. త‌ను ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్ (ఎస్ ఆర్ హెచ్) జ‌ట్టుకు య‌జ‌మాని గా ఉన్నారు కావ్య మార‌న్. త‌ను ఉన్న‌త విద్య‌ను చ‌దివారు. త‌న తండ్రి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌. ద‌యానిధి మార‌న్ కుటుంబానికి చెందిన మ‌హిళ‌. భార‌త దేశంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ప్ర‌స్తుతం త‌ను వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు కావ్య మార‌న్. త‌ను గ‌త ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో ఆస‌క్తిక‌ర‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాను సోష‌ల్ మీడియా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. త‌న‌కు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఫాలో అవుతూ ఉన్నారు. ఆమె అందం ఆ జ‌ట్టుకే కాదు ఐపీఎల్ కే హైలెట్ గా , కేంద్రంగా మారింది. ఇదే క్ర‌మంలో పెద్ద ఎత్తున మీమ్స్ కూడా వ‌చ్చాయి. మ‌రో వైపు త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఉన్న అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తో త‌ను సాన్నిహిత్యంగా ఉంటోంది. ఈ ఇద్ద‌రూ త్వ‌ర‌లో ఒక్క‌టి కాబోతున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది జోరుగా. ఈ త‌రుణంలో నిన్న‌టి దాకా తాను సామాజిక మాధ్య‌మాల నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో తాజాగా తాను తిరిగి ఎక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు స్వ‌యంగా వెల్ల‌డించింది.

  • Related Posts

    సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

    Spread the love

    Spread the loveబీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం…

    ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *