సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు

Spread the love

బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ కామెంట్స్

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు భార‌త జ‌ట్టు బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్. త‌ను మీడియాతో మాట్లాడాడు. శాంస‌న్ న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా జ‌రిగిన మూడు మ్యాచ్ ల‌లో ఘోరంగా విఫ‌లం అయ్యాడు. త‌ను కేవ‌లం 10, 6, 0 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఓ వైపు సూర్య కుమార్ యాద‌వ్ మ‌రో వైపు శుభ్ మ‌న్ గిల్ లు సైతం ఫామ్ లేమితో బాధ ప‌డ్డారు. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఒకానొక ద‌శ‌లో శుభ్ మ‌న్ గిల్ ను టి20 ఫార్మాట్ నుంచి త‌ప్పించారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు సంజూ శాంస‌న్. త‌న‌ను తీసి వేస్తారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో తీవ్రంగా స్పందించాడు బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్. త‌ను ఒకే ఒక్క ఇన్నింగ్స్ కు దూరంలో ఉన్నాడ‌ని అన్నాడు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్న శాంస‌న్ కు బౌలింగ్ కోచ్ బాస‌ట‌గా నిల‌వ‌డం ఒకింత ఉప‌శ‌మనాన్ని ఇచ్చింది. ఈ యంగ్ ఓపెనర్ పేలవ ఫామ్ నుండి బయట పడటానికి కేవలం ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని ఆయన అన్నారు. శాంసన్ ఇప్పటి వరకు మూడు T20లలో అత్యధికంగా 10 పరుగులతో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఆత్మ విశ్వాసం పొందడానికి, ఫామ్ లోకి రావ‌డానికి త‌ను ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడ‌ని భరోసా ఇచ్చాడు.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *