ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Spread the love

అమిత్ షా, నిర్మాలా సీతారామన్ ల‌తో భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని కోర‌నున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ చేశారు.

  • Related Posts

    పోలీసుల‌పై గాద‌రి కిషోర్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని కేసుల‌పై ఫైర్ న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల ప‌నితీరు దారుణంగా ఉంద‌న్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు ప‌నిగ‌ట్టుకుని త‌మ‌ను ల‌క్ష్యంగా…

    న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం కృషి చేస్తా : కోమటిరెడ్డి

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ ను గెలిపిస్తే మ‌రిన్ని నిధులు మంజూరున‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ న‌గ‌రం అభివృద్ది కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇవాళ మున్సిప‌ల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *