ఆదాయంలో ముంబై కార్పొరేష‌న్ నెంబ‌ర్ వ‌న్

2వ స్థానంలో బెంగ‌ళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీ
హైద‌రాబాద్ : మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్న ముంబై కార్పొరేష‌న్ చ‌రిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గ‌ణ‌నీయ‌మైన ఆదాయ‌న్ని గ‌డించింది. ఈ సంద‌ర్బంగా అత్య‌ధిక ఆదాయం క‌లిగిన కార్పొరేష‌న్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. మౌలిక వసతులు, అభివృద్ధి పనుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముంబై కార్పొరేష‌న్ రూ. 74,427 కోట్ల‌తో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా , 2వ స్థానంలో బెంగ‌ళూరు కార్పొరేష‌న్ నిలిచింది. ఈ సంస్థ రూ. 19,930 కోట్ల ఆదాయాన్ని గ‌డించింది. మూడ‌వ స్థానంలో దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ కార్పొరేష‌న్ నిలిచింది. ఈ సంస్థ రూ. 16,530 కోట్ల‌తో ఆదాయ‌న్ని గ‌డించింది.

ఇక కార్పొరేష‌న్ల జాబితాలో రూ. 15,502 కోట్ల‌తో గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ కార్పొరేష‌న్ నిల‌వ‌గా , 5వ స్థానంలో రూ. 12, 618 కోట్ల‌తో పూణే కార్పొరేష‌న్ , 6వ స్థానంలో రూ. 11, 460 కోట్ల‌తో హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) నిలిచింది. ఇక 7వ ప్లేస్ లో రూ. 8,400 కోట్ల‌తో చెన్నై కార్పొరేష‌న్ నిల‌వ‌గా , త‌ర్వాతి స్థానాల‌లో కోల్ క‌తా కార్పొరేష‌న్ రూ. 5,166 కోట్లతో, విశాఖ‌ప‌ట్నం కార్పొరేష‌న్ రూ. 4, 672 కోట్ల‌తో 10వ స్థానంలో నిలిచింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *