పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి

భ‌క్తుల‌ను అనుగ్ర‌హించిన స్వామి

తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ కపిలేశ్వర ఆల‌యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తొమ్మిదో రోజైన సోమ‌వారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.

కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు,ఇత‌ర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఈ విశేష ప‌ర్వ‌దినాల సంద‌ర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర…

    వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

    అమ‌రావ‌తి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *