రాజ్య‌స‌భ అభ్య‌ర్థులపై హై క‌మాండ్ దే ఫైన‌ల్

Spread the love

స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌లో రాజ్యస‌భ స‌భ్యుల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఎన్నిక నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై అంతిమ నిర్ణ‌యం పార్టీ హైకమాండ్ చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో త‌న ప్రమ‌యేం అనేది ఉండ‌ద‌ని అన్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంద‌ని, గ్రామ‌, ప‌ట్ట‌ణ స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించామ‌న్నారు.

67 శాతం వార్డు మెంబెర్స్ సీట్ల‌ను బీసీ లకు ఇచ్చామ‌ని చెప్పారు మ‌హేష్ కుమార్ గౌడ్. మేయర్, మున్సిపల్ చైర్మన్ లలో 50 శాతం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ్యసభ బీసీకి ఇస్తారా లేదా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి , సీనియ‌ర్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి అర్థం చేసుకోవాల‌ని అన్నారు. సీట్ల‌ను స‌ర్వే ప్ర‌కారం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. స‌భ్యుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ల ఎంపిక పూర్త‌యింద‌ని చెప్పారు టీపీసీసీ చీఫ్‌. మున్సిపల్ ఎన్నికల తర్వాత హైక‌మాండ్ పూర్తి సంతృప్తితో ఉందన్నారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *