newsseals.com
News

క‌డియం శ్రీ‌హ‌రి కామెంట్స్ రాజ‌య్య స్ట్రాంగ్ కౌంట‌ర్

VijayaBhaskar February 20, 2026
newsseals-TatikondaRajaiah
Spread the love

కేసీఆర్ ను చూస్తే నీకు లాగు త‌డిచి పోతుంది

వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి పై భ‌గ్గుమ‌న్నారు. తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే నీకు త‌మ నాయ‌కుడు, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. శుక్ర‌వారం తాటికొండ రాజ‌య్య మీడియాతో మాట్లాడారు. ఇలాంటి నీతిత‌ప్పిన మాట‌లు మాట్లాడ‌టం బంద్ చేయాల‌ని సూచించారు. కేసీఆర్ ని బయటకి రా అంటున్నావు..ఆయనను చూస్తేనే నీ లాగు తడుస్తదంటూ ఎద్దేవా చేశారు . త‌ను చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు. ఒక స్థాయి నాయ‌కుడు మాట్లాడాల్సిన మాట‌లు ఇవి కావ‌న్నారు.

కాళేశ్వరం వర ప్రదాయిని అని ఆనాడు చెప్పి, ఈరోజు కూలేశ్వరం అనడానికి నోరు ఎలా వస్తుంది కడియం శ్రీహరి? అంటూ నిప్పులు చెరిగారు తాటికొండ రాజ‌య్య‌. 2009, 2011 నా చేతిలో చిత్తుగా ఓడిపోయిన కడియం శ్రీహరి కేసీఆర్ దయ వల్ల ఎన్నో పదవులు అనుభవించాడ‌ని ఆవిష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు. కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయి, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిన నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా? అంటూ భ‌గ్గుమ‌న్నారు రాజ‌య్య‌.