ఫోన్ నెంబర్ తో పాటు పేరు కూడా
ట్రాయ్ సంచలన ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ – దేశంలోని టెలికాం కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చింది ట్రాయ్ (టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ) . ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి అన్ని టెలికాం ప్రొవైడర్ కంపెనీలన్నీ ఆయా మొబైల్ నెంబర్లకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు అదే పనిగా ఫోన్లు చేయడానికి చెక్ పెట్టింది. రాంగ్ కాల్స్ లేదా ఇతర అపరిచిత వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన గుర్తింపును కూడా తెలియాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్.
ఇక నుంచి వెంటనే అమలులోకి తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఫోన్ నెంబర్ తో పాటు కాల్ చేసే వ్యక్తుల పేర్లను కూడా ప్రదర్శించనున్నాయి. తెలియని నెంబర్ నుండి ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసు కునేందుకు ట్రాయ్ ప్రజలను అనుమతిచ్చింది. ఇది స్పామ్ లను నిలిపి వేస్తుందని పేర్కొంది.
చందా దారులు లేదా టెలికాం వినియోగదారుల కోసం కాలర్ గుర్తింపు సామర్థ్యాలను మెరుగు పరుస్తుందని తెలిపింది ట్రాయ్. కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్) లో చందాదారులు అందించిన పేరు గుర్తింపు సమచారం సీఎన్ఏపీ ప్రయోజనాల కోసం ఉపయోగించ బడుతుందని పేర్కొంది ట్రాయ్.