సీట్ల కంటే పార్టీ భవిష్యత్ ముఖ్యం
బీజేపీ అధ్యక్షుడు సింగం అన్నామలై
తమిళనాడు – సీట్ల కోసం కక్కుర్తి లేదని , కానీ పార్టీ పరంగా మరింత బలోపేతం చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సింగం అన్నామలై. తమ టార్గెట్ 400 సీట్లకు పైగా రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ దేశంలోని 143 కోట్ల మంది ప్రజలు పూర్తిగా సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సింగం అన్నామలై. యావత్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత దేశం వైపు చూస్తోందని స్పష్టం చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయం మరోసారి జెండా ఎగర వేయడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి చెప్పేవన్నీ అబద్దాలు, సొల్లు కబుర్లేనంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఇండియా అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందని పేర్కొన్నారు.
పటిష్టతమైన నాయకత్వం ఎప్పటికీ ముందంజలో కొనసాగుతుందని , అదే తమను ముందుకు నడిపిస్తోందని చెప్పారు సింగం అన్నామలై.