న‌న్ను ఇబ్బంది పెడితే విజ‌య్ చిట్టా విప్పుతా

Spread the love

ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానుల‌కు సంగీత వార్నింగ్

చెన్నై : త‌న‌కు విడాకులు కావాలంటూ ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ భార్య సంగీత కోర్టును ఆశ్ర‌యించింది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది త‌ను చేసిన కామెంట్స్. దీంతో త‌న‌పై పెద్ద ఎత్తున విజయ్ ఫ్యాన్స్ ఒత్తిడి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ వాపోయింది. శ‌నివారం ఎక్స్ వేదిక‌గా స్పందించింది. నా మీద ఇలాగే ఒత్తిడి తెస్తే ఆ హీరోయిన్ పేరు బయట పెడతాన‌ని సంగీత హెచ్చ‌రించింది. మీ రాజకీయ ఒత్తిళ్ల కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్లను మోసం చేస్తారా సిగ్గు లేదా అని ప్ర‌శ్నించింది. విజ‌య్ కి ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఎన్నోసార్లు చెప్పాన‌ని, అయినా త‌ను వినిపించు కోలేద‌ని వాపోయింది సంగీత‌.

నాతో గతంలో చాలా సార్లు ప‌క్క‌ రాష్ట్రాల రాజకీయ నేతల గురుంచి మాట్లుడుతూ ఆ నాయకుడు ఆ హీరోయిన్ లొంగదీసుకున్నాడు, ప్లాట్ ఇచ్చాడు. సినిమా ఫంక్షన్ కి వెళ్తున్నాడు అని పక్క రాష్ట్రాల రాజకీయ నాయకుల పేర్లు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదని తెలిపింది. అయితే త‌ను వాళ్ళని అనుసరిస్తున్నాడు అని ఇప్పుడు అర్తం అయ్యింద‌ని పేర్కొంది. ఒక‌వేళ త‌న‌ను ఇలాగే విజ‌య్ అభిమానులు ఇబ్బంది పెట్టాల‌ని చూస్తే మీ హీరో అస‌లు బాగోతాన్ని , బండారాన్ని బ‌య‌ట పెడ‌తాన‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సంగీత‌.

  • Related Posts

    న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

    Spread the love

    Spread the loveనవ్వడం తెలిసిన అరుదైన న‌టుడు హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ఏప్రిల్ 16 ఆయన జ‌యంతి. ఈ సంద‌ర్బంగా మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఘ‌నంగా నివాళులు అర్పించారు.…

    పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో సింగ‌ర్ మంగ్లీ

    Spread the love

    Spread the loveత‌న‌పై ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లి అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్ సంచ‌ల‌నంగా మారారు. త‌నపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డ్ర‌గ్స్ కు సంబంధించిన కేసు కూడా కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో మ‌రోసారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *