ర‌ష్మిక మంద‌న్నా మ‌జాకా

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు ఒక్క‌ట‌య్యారు న‌టీ న‌టులు ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎవ‌రికి వారు సినిమాల‌లో న‌టిస్తూనే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీరు ఎక్క‌డికి వెళ్లినా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మార‌డంతో అంద‌రి దృష్టి వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నారా లేదా అని ఉత్కంఠ‌కు గుర‌య్యారు. వీరి టెన్ష‌న్ కు చెక్ పెడుతూ ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లు అంద‌రి స‌మ‌క్షంలో ఒక‌రినొక‌రు పెళ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రికి సంబంధించిన పెళ్లి వేడుక‌ల ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరు పొందిన ర‌ష్మిక మంద‌న్నా స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ స్వ‌స్థలం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనిది. ఈ ఇద్ద‌రూ తొలిసారిగా మూవీస్ లో తార‌స ప‌డ్డారు. ఇద్ద‌రూ క‌లిసి రెండు సినిమాల‌లో న‌టించారు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన గీత గోవిందం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. ఒక ర‌కంగా లీన‌మై పోవ‌డంతో మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమా షూటింగ్ లోనే ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లు పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయిన‌ట్లు టాక్. అయితే అంత‌కు ముందు ర‌ష్మిక ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఎందుక‌నో త‌న‌ను వ‌ద్ద‌నుకుంది. ఇప్పుడు విజ‌య్ పంచ‌న చేరింది.

  • Related Posts

    ఆ న‌టుల‌తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వం

    చెన్నై : అందాల ముద్దుగుమ్మ‌గా పేరు పొందిన వ‌ర్ద‌మాన న‌టి న‌మిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఎంద‌రో న‌టుల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా త‌ను న‌టించిన న‌టుల‌లో ఎవ‌రు త‌న‌కు బాగా నచ్చార‌నే విష‌యాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్…

    గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *