newsseals.com
DEVOTIONAL

వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

VijayaBhaskar March 4, 2026
newsseals-Kumaradhara
Spread the love

ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి

తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు. అంత‌కు ముందు చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ప్ర‌ధాన ఆల‌యాన్ని మూసి వేశారు.

అనంత‌రం ఆల‌యాన్ని శుద్ది చేశారు. ఆల‌య ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌ధాన పూజారులు శ్రీ‌వారి గుడిని తెరిచారు. ఈ సంద‌ర్బంగా ఆల‌య ఆన‌వాయితీ ప్ర‌కారం శుద్ది చేశారు. ఆ క‌లియుగ దైవం అయిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా ఈవోగా కొలువు తీరిన ర‌విచంద్ర ఫుల్ ఫోక‌స్ పెట్టారు తిరుమ‌ల ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా స‌క‌ల సౌక‌ర్య‌లు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.