ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలలో పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ ప్రథమ, శశికళ ద్వితీయ, కుమారి ఇంద్రజ తృతీయ స్థానలో నిలిచారు. అదేవిధంగా వ్యాసరచన పోటీలలో శ్రీలత ప్రథమ, అలేఖ్య ద్వితీయ, శ్రీలక్ష్మీ తృతీయ స్థానలో నిలిచారు.
ఇదిలా ఉండగా పోటీలలో భాగంగా మార్చి 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమం) ఆనందరాజు ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.





