ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా ప‌రాజ‌యం

Spread the love

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన కీవీస్ బ్యాట‌ర్

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెట‌ర్ ఫిన్ అలెన్. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా విండీస్ తో జ‌రిగిన కీల‌క పోరులో భార‌త జ‌ట్టుకు చెందిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అద్భుత ఇన్నింగ్స్ ను మ‌రిచి పోక ముందే మ‌రో సూప‌ర్ షోతో ఆక‌ట్టుకున్నాడు కీవీస్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్. వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా జ‌రిగిన తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. స‌ఫారీ జ‌ట్టులో మార్కో యాన్సెస్ 30 బంతుల‌లో 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు బ్రెవిస్ 27 బంతులలో 3 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 34 ప‌రుగులు చేశాడు.

అనంత‌రం 170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కీవీస్ ఆది నుంచే స‌ఫారీల‌ను ఉతికి ఆరేయ‌డం మొద‌లు పెట్టాడు అలెన్. త‌ను కేవ‌లం కేవ‌లం 33 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 10 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. మైదానం న‌లుమూలలా ఆక‌ట్టుకునేలా, క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు ఫిన్ అలెన్. త‌న‌తో పాటు టిమ్ సిఫ‌ర్ట్ 33 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 58 ర‌న్స్ చేశాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశారు. ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు చేర్చారు.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *