ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా

Spread the love

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ నేడు

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త జ‌ట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైన‌ల్ కు చేరాలంటే సిస‌లైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో స‌త్తా చాటాల్సి ఉంటుంది సూర్య భాయ్ సేన‌. ఇప్ప‌టికే బ్యాటింగ్ ప‌రంగా బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బౌలింగ్ కొంత ఇబ్బంది పెడుతోంది. గౌతం గంభీర్ కోచ్ గా ఉన్న జ‌ట్టు ఇప్పుడు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ద‌మైంది. కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ స్కోర్ ను ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది టీమిండియా.

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. విండీస్ ఆట‌గాళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. త‌ను ఒక్క‌డే 97 ర‌న్స్ చేశాడు. అత్యంత బాధ్యతాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇండియాను సెమీ ఫైన‌ల్ కు చేర్చ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. మ‌రో వైపు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , ఇషాన్ కిష‌న్ , హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లు కీ రోల్ పోషించాల్సి ఉంది. మ‌రో వైపు ఎలాగైనా ఇండియాను ఓడించి ఫైన‌ల్ కు చేరుకోవాల‌ని ఇంగ్లండ్ ప్లాన్ వేస్తోంది. మ‌రో వైపు కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి సెమీస్ లో ఊహించ‌ని రీతిలో ద‌క్షిణాఫ్రికా ను మట్టి క‌రిపించింది. 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *