భార‌త్ కు చుక్క‌లు చూపించిన జాక‌బ్ బెథెల్

Spread the love

బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెట‌ర్

ముంబై : భార‌త్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు చివ‌రి ఓవ‌ర్ దాకా పోరాడింది. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు యంగ్ క్రికెట‌ర్ జాక‌బ్ బెథెల్. త‌ను భార‌త బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. చివ‌ర‌కు అనుకోకుండా ర‌నౌట్ కావ‌డంతో ఇంగ్లండ్ ఆశ‌లు ఆవ‌రి అయ్యాయి. సామ్ క‌ర‌న్ ఉన్న‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేక పోయాడు. భార‌త జ‌ట్టు స‌మిష్టిగా రాణించింది. అటు బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టింది. ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటింది. ఫీల్డింగ్ లో దుమ్ము రేపింది. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కేవ‌లం 7 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. ఇంటి బాట ప‌ట్టింది.

ఇక ప్ర‌త్యేకించి ఇంగ్లండ్ టీంలో చెప్పుకోవాల్సింది ఒకే ఒక్క‌డు. త‌నే జాక‌బ్ బెథెల్. త‌ను ఆట తీరుతో మెస్మ‌రైజ్ చేశాడు. భార‌తీయుల అభిమానుల మ‌నసు దోచుకున్నాడు. క‌ళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. త‌క్కువ బంతులో సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఒక ర‌కంగా టీమిండియాకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు.
బార్బాడియన్‌కు చెందిన జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టే లక్ష్యాన్ని చేరుకోవడానికి ద‌గ్గ‌ర‌గా తీసుకు వ‌చ్చాడు. కానీ ఆశించిన రీతిలో ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఓట‌మి పాలైంది.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *