టీం ఇండియా త‌ప్ప‌కుండా గెలుస్తుంది

ఆధ్యాత్మిక వక్త , కోచ్ జ‌యా కిషోరి కామెంట్స్

అహ్మ‌దాబాద్ : ప్ర‌ముఖ భార‌తీయ ఆధ్యాత్మిక వేత్త‌, శిక్ష‌కురాలు జ‌యా కిషోరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆమె గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వేదిక కానుంది మోదీ స్టేడియం. భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు క‌ప్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ల‌క్షా 30 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు దేశానికి చెందిన ప్ర‌ముఖులంతా క్యూ క‌ట్టారు అహ్మ‌దాబాద్ కు. ఇప్ప‌టికే అన్ని హొట‌ళ్లు నిండి పోయాయి. ఇప్ప‌టికే భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

గుజ‌రాత్ స‌ర్కార్ ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ కోసం క‌నీవిని ఎరుగ‌ని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ మ్యాచ్ ను తిల‌కించేందుకు స్వ‌యంగా విచ్చేశారు ఆధ్యాత్మిక వేత్త జ‌యా కిషోరి. ఈ సంద‌ర్బంగా అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టులో జాతీయ మీడియాతో మాట్లాడారు. భారతదేశం గెలవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానని అని చెప్పారు. భార‌త‌ ఆటగాళ్ళు అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తార‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. వారు గెలవాలని నేను ఆశిస్తున్నానని తెలిపారు. తాము ఎల్లప్పుడూ మా జట్టుతో నిలబడతామన్నారు, ఏది ఏమైనా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు సాన్సన్ చాలా బాగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చారు జ‌యా కిషోరి. ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఆట‌గాడు అద్భుతంగా ఆడ‌తార‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *