5 ఇన్నింగ్స్ లు 321 పరుగులతో రికార్డ్
అహ్మదాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి రికార్డ్ నెలకొల్పాడు. గతంలో భారత క్రికెట్ కు చెందిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కు చెందిన అఫ్రిదీ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. తనలో సత్తా ఉందని, తనకు ఎదురే లేదని నిరూపించాడు . తన 11 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒకసారి జట్టులో ఎంపికైతే మరోసారి జట్టు నుంచి తీసి వేయడం, అవమానాలకు గురి కావడం జరిగింది. కానీ వాటిని అన్నింటిని తోసి రాజని తనకు వచ్చిన అరుదైన ఛాన్స్ ను తను వాడుకున్నాడు.
భారత జట్టును విశ్వ విజేతగా నిలవడంలో, కప్ ను అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తను ఆడక పోయి ఉంటే ఇవాళ భారత్ టి20 వరల్డ్ కప్ ను అందుకునేది కాదు. కోచ్ , కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ షో చేశాడు సంజు శాంసన్. ఇదిలా ఉండగా ఈ టోర్నీలో తను 5 ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 321 పరుగులు చేశాడు. 80.26 సగటుతో, 199.38 స్ట్రైక్ రేట్ తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో సంజు శాంసన్ 24 సిక్సర్లు, 27 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 50 బంతులు ఎదుర్కొని 97 రన్స్ చేశాడు. సెమీస్ లో ఇంగ్లండ్ తో 42 బంతులు ఎదుర్కొని 89 రన్స్స చేయగా, ఫైనల్ లో 46 బాల్స్ ఎదుర్కొని 89 రన్స్ చేశాడు.






