కేర‌ళ భూమి పుత్రుడు సంజు శాంస‌న్

Spread the love

విద్యా శాఖ మంత్రి వి. శివ‌న్ కుట్టి కామెంట్స్

తిరువనంతపురం | టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాట‌డ‌మే కాకుండా ఇండియాకు క‌ప్ ను తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంసన్. త‌ను గ‌నుక క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో గ‌నుక 97 ప‌రుగులు చేసి గెలిపించ‌క పోయి ఉండి ఉంటే ఇండియా ఇవాళ క‌ప్ గెలిచి ఉండేది కాదు. అంతే కాదు జ‌ట్టులో స్థానం కోల్పోయి, అనూహ్యంగా జ‌ట్టులోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ ఉన్న‌ట్టుండి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎంపిక‌య్యాడు. ఈ సంద‌ర్బంగా దేశ‌మంత‌టా జేజేలు ప‌లుకుతున్నారు త‌న గురించి. సోమ‌వారం శాంస‌న్ ఆట తీరు గురించి ప్ర‌శంస‌లు కురిపించారు కేరళ విద్యా శాఖ మంత్రి వి. శివన్‌కుట్టి . ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సంజు సామ్సన్ కేరళ భూమి పుత్రుడ‌ని ప్ర‌శంసించారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన క్రికెటర్. గతంలో క్రికెట్‌లో అనేక రాజకీయ జోక్యాలు జరిగాయి. సంజు సామ్సన్ ఇటువంటి రాజకీయ జోక్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి. ప్రతి విషయంలోనూ మలయాళీగా గుర్తించబ డాలని కొందరు అంగీకరించడం కష్టం. సంజు సామ్సన్ కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. తన ప్రతిభ, నిజాయితీ, అంకితభావంతో, సంజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్ అయ్యాడు. సంజు మనందరికీ గర్వకారణం. ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయనను అభినందించారు. నేను ఈ ఉదయం సంజుతో ఫోన్ ద్వారా మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ ఆయనను సంప్రదించ లేకపోయానని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా క్రీడా మండలి సంయుక్తంగా తిరువనంతపురంలో సంజుకు స‌న్మానం చేస్తామ‌ని చెప్పాడు .

  • Related Posts

    చెన్నై సూప‌ర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్

    Spread the love

    Spread the loveముంబై ఇండియ‌న్స్ పై గ్రాండ్ విక్ట‌రీ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ ఓడి పోయి…

    ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాం : పాండ్యా

    Spread the love

    Spread the loveప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు బాగా ఆడింది ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *