సంజు శాంస‌న్ మ్యాచ్ విన్న‌ర్ ప్లేయ‌ర్ : గ‌వాస్క‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ

అహ్మ‌దాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌ను భార‌త జ‌ట్టుకు క‌ప్ ను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని ప్ర‌శంసించాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో మూడు డిఫరెంట్ నాక్‌లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎదిగిన సంజు సామ్సన్ జీవితం పూర్తి వృత్తంలోకి వచ్చిందని పేర్కొన్నాడు. సోమవారం ఆయ‌న ప్ర‌ముఖ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశాడు. విండీస్ తో త‌ను ఆడిన తీరు అద్భుతం అన్నాడు. ఆరోజు గ‌నుక త‌ను ఆడ‌క పోయి ఉంటే ఇండియా సెమీస్ కు వ‌చ్చేది కాద‌న్నాడు. ఇదే క్ర‌మంలో బ్రిటిష‌ర్ల‌పై విరుచుకు ప‌డిన విధానం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు.

అంతే కాకుండా తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో సైతం 89 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని, త‌ను ఆడిన ప్ర‌తి షాట్ సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సంజు సామ్సన్ జీవితం పూర్తి స్థాయికి చేరుకుందన్నాడు. 2026 T20 ప్రపంచ కప్‌కు ముందు, అతను న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. అతన్ని తొలగించారు, తరువాత T20 ప్రపంచ కప్ ప్రారంభమైన తర్వాత, నమీబియాతో ఆడే అవకాశం అతనికి లభించింది, కానీ అతని ఆటతీరు అతని స్థానాన్ని నిలబెట్టు కోవడానికి సరిపోలేదన్నాడు. మొత్తంగా సంజు శాంస‌న్ అంటే ఏమిటో దేశానికి, ఈ ప్ర‌పంచానికి తెలియ చేశాడ‌ని కితాబు ఇచ్చాడు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *